Amit Shah on India China Border Issue: రాహుల్ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలని.. పార్లమెంటులో చర్చకు సిద్ధం

Amit Shah on India China Border Issue: గల్వాన్‌ వ్యాలీలోని భారత భూభాగంలోకి చైనా సైన్యం చొరబాటు, ఘర్షణపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు.

Update: 2020-06-28 12:15 GMT

Amit Shah on India China Border Issue: గల్వాన్‌ వ్యాలీలోని భారత భూభాగంలోకి చైనా సైన్యం చొరబాటు, ఘర్షణపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు.భారత భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించకపోతే ఘర్షణలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. ఈ ఘర్షణలో 20 మంది సైనికులతో సహా ఓ కమాండింగ్ అధికారి ఎలా మరణించారన్నారు. ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చైనా మనదేశ భూమిని స్వాధీనం చేసుకుందని, మేము చర్య తీసుకోబోతున్నామని భయపడకుండా మీరు నిజం మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు

ఇక దీనిపై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాహుల్ గాంధీ చైనా- పాకిస్థాన్ లకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. చైనా అంశాన్ని లోక్ సభలో వివరించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందంటూ.. ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిచ్చే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం దేనికైనా జవాబిస్తుందని,1962 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో పార్లమెంటులో సిసలైన చర్చకు సిద్ధంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఈ విషయంలో ఊహాజనిత రాజకీయాలు చేస్తున్నారని అమిత్ షా అన్నారు. సరెండర్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ పై రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు పాకిస్థాన్, చైనా ఇలాంటి ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. భారత వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొనే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని, కానీ ఓ అతిపెద్ద రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమని షా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News