ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై అమిత్ షా స్పందన

Update: 2020-02-13 15:22 GMT

తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. మొత్తం 70 స్థానాలకి గాను ఆప్ 62 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 8 స్థానాలను దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. తాజాగా ఢిల్లీలోని ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అయన పార్టీ ఓటమిపై స్పందించారు. బీజేపీ నాయకులు 'గోలీ మారో', 'ఇండో-పాక్ మ్యాచ్' వంటి ద్వేషపూరిత ప్రసంగాలు చేయరాదని, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ఓటమికి కారణమై ఉండవచ్చని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా ఉందని కానీ తన అంచనా తప్పు జరిగిందని అన్నారు. గేలుపు, ఓటముల గురించి ఎప్పుడు ఎన్నికలలో పోరాడలేదని, పార్టీ భావజాలాన్ని వ్యాప్తి కోసమే ప్రయత్నిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. ఇక ఢిల్లీ ఎన్నికల్లో సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్ ప్రభావం లేదని అభిప్రాయపడ్డారు. తనతో సీఏఏకు సంబంధించిన సమస్యలను చర్చించాలనుకునే ఎవరైనా తన కార్యాలయం నుండి సమయం కోరవచ్చునని ఆయన అన్నారు. మూడు రోజుల్లో సమయం ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచార భాగంగా కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రితాలా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓ స‌భ‌లో అయన మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళ‌న‌లు చేప‌డుతున్నవారంత దేశ‌ద్రోహులేనని అన్నారు. ఈ వ్యాఖ్యలకు జనం కూడా కేకలు వేస్తుండడంతో మంత్రి ఆ ఊపులో (గోలీ మారో) అంటూ రెచ్చగొట్టేలా ప్రసంగించారు. దీనిపైన కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక మరో బీజేపీ అభ్యర్ధి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ ఓ ఘాటైన ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News