అమిత్‌షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం

జమ్మూకశ్మీర్‌లోని భద్రతా వ్యవహారాలతో పాటు మరికొన్ని కీలకాంశాలను చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

Update: 2019-08-19 15:37 GMT

జమ్మూకశ్మీర్‌లోని భద్రతా వ్యవహారాలతో పాటు మరికొన్ని కీలకాంశాలను చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఐబీ చీఫ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఇంటర్నెట్, ఫోన్ సేవలను పునరుద్ధరించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి అజిత్ దోవల్ 11 రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అక్కడి క్షేత్రస్థాయి విషయాలపై దోవల్ హోంమంత్రి షాకు ఓ రిపోర్టును సమర్పించినట్లు తెలుస్తోంది.

Similar News