బస్సు సేవలను తిరిగి ప్రారంభించిన తొలి రాష్ట్రంగా హర్యానా!

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సారైనా మార్గంగా ఎంచుకున్నాయి.

Update: 2020-05-16 11:27 GMT

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సారైనా మార్గంగా ఎంచుకున్నాయి.. దీనివలన అన్ని ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి..ఇక ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించిపోయింది.. కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుతుండడంతో నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

అయితే లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న వలస కార్మికులను తీసుకొచ్చేందుకు ఏపీఆర్టీసీ సేవలు ప్రారంభించాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే, హరియాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బస్సు సేవలను తిరిగి ప్రారంభించింది. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో తొలిసారి బస్సు సేవలను ప్రారంభించిన రాష్ట్రంగా పేరు గాంచింది.

''ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మందిని పంపుతున్నాం. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో చిక్కుకుపోయిన ఇతర జిల్లా వాసులను వారి గమ్య స్థానాలకు చేర్చాలని నిర్ణయించాం. అందుకే అంతర్‌ జిల్లా బస్సు సేవలను ప్రారంభించాం'' అని హరియాణ పోలీస్‌ చీఫ్‌ మనోజ్‌ యాదవ్‌ వెల్లడించారు..

ఇక హర్యానాలో కరోనా కేసుల 818 కి చేరింది. అక్కడ 11 మరణాల సంభవించాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మూడో దశ లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3970 కేసులు నమోదు కాగా, 103 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 85,940కి చేరింది. అందులో 2752 మంది మృతిచెందారు. ప్రస్తుతానికి 53,035 యాక్టివ్ కేసులు ఉండగా, 30,153 మంది డిశ్చార్జి అయ్యారు. 

Tags:    

Similar News