ట్రాఫిక్ చలానా 18 వేలు ... ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్

Update: 2019-09-28 10:20 GMT

కొత్తగా వచ్చిన వాహన చట్టాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపైన వాహనదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూనే వస్తున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ తనకి విధించిన చలానాని చూసి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నివాసం ఉంటాడు రాజు సోలంకి.. ఆటో నడపడం అతని వృత్తి. అయితే కొత్త వాహన చట్టం కింద రాజుకి ట్రాఫిక్ పోలీసులు18 వేల చలానా విధించారు. దీనితో చేసేది ఏమిలేకా ఫినాయిల్‌ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాజు మాట్లాడుతూ... నేను చాలా పేదవాడిని నాకు ట్రాఫిక్ పోలీసులు 18వేల రూపాయల చలానా విధించారు. దీనిని కట్టలేదని నా ఆటో సిజ్ చేసారు.ఇప్పుడు ఎలా నా కుటుంబ భారాన్ని మోయలని రాజు ఆవేదన వ్యక్తం చేసాడు. 

Tags:    

Similar News