చుక్కలను తాకుతున్న బంగారం, వెండి ధరలు

Update: 2019-08-30 07:10 GMT

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూపోతున్న పుత్తడి ధర నేటి మార్కెట్లో ఏకంగా రూ. 40వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిన్న ఒక్కరోజే రూ. 250 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ. 40,220 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది.

ప్రస్తుతం బంగారం ధర ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40 వేల మార్క్ ను దాటింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నైలలో కూడా 40 వేల మార్క్ ను క్రాస్ చేసింది. ఇక వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. నేడు రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 49,050కి చేరింది.

ఆర్థిక మాంద్యం భయాలతో పాటు అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, రూపాయి క్షీణత తదితర అంశాల బంగారం ధరలపై ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. దీనికితోడు పండగ సీజన్‌ కావడంతో నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News