గోవా ప్రభుత్వ కీలక నిర్ణయం... అర్థరాత్రి నుంచి కంప్లీట్ లాక్ డౌన్

కరోనా వైరస్ తన పంజా విసురుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ ఆయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి..

Update: 2020-03-24 12:36 GMT
Goa CM Pramod Sawant (file photo)

కరోనా వైరస్ తన పంజా విసురుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ ఆయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. ఈ మహమ్మారి వైరస్ ని అరికట్టేందుకు కఠిన చర్యలను ముందుకు తీసుకువచ్చాయి. ఇక మార్చి 31 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే తాజాగా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి నుంచి కంప్లీట్ లాక్ డౌన్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

ఈ పర్యాటక కేంద్రానికి ప్రసిద్ధి పొందిన గోవా దీనిపై పూర్తి నిషేధం విధించింది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులును కూడా మూసివేశారు పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో గోవా ప్రభుత్వం అలెర్ట్ అయింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కంప్లీట్ లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది.. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 కు చేరాయి. పది మంది చనిపోయారు.



Tags:    

Similar News