Viral Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన

Viral Video: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Update: 2023-10-05 02:24 GMT

Viral Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన

Viral Video: ఉత్తరప్రదేశ్‌ లోని లఖ్‌నవూలో ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో బాలిక చిక్కుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాదాపు 20 నిమిషాల పాటు లిఫ్ట్‌ తలుపులు తెరుచుకోకపోవడంతో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది.

లఖ్‌నవూలోని కుర్సీ రోడ్‌లో జానేశ్వర్‌ ఎన్‌క్లేవ్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ సముదాయంలో నివసిస్తున్న ఓ బాలిక లిఫ్ట్‌ ఎక్కింది. అది మధ్యలోనే ఆగిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆ బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. అయినా ధైర్యం తెచ్చుకుని తలుపులు తెరవడానికి తనవంతు ప్రయత్నం చేసింది. అది రాకపోయేసరికి బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. తనను ఎవరైనా రక్షించాలని ఆమె కెమెరా వైపు చూసి ప్రాధేయపడుతున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో బాలిక స్కూల్ డ్రెస్‌లో కన్పిస్తోంది. దాదాపు 20 నిమిషాల తరువాత బాలికను లిఫ్ట్‌లో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News