Modi: ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
Modi: ప్రధాని మోడీతో ఒలాఫ్ షోల్జ్ భేటీ
Modi: ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
Modi: రష్యా- ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఒత్తిడి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. కొవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచంపై పడిందని అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రష్యా- ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్ సూచిస్తూనే ఉందని ప్రధాని మోడీ అన్నారు.
ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కొవిడ్, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం యావత్ప్రపంచం అనుభవించిందని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందిందన్న జర్మన్ ఛాన్సలర్.. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిదన్నారు.