10th Passed at 56 Age: రూ. 40లేక చదువు ఆపేసిన గుమాస్తా...56 ఏళ్లకు పదో తరగతి పాస్
10th Passed at 56 Age: రూ. 40లేక చదువు ఆపేసిన గుమాస్తా...56 ఏళ్లకు పదో తరగతి పాస్
10th Passed at 56 Age: చదువుకోవాలనే పట్టుదల ఉంటే అందుకు వయస్సు అడ్డురాదని నిరూపించాడు ఆ వ్యక్తి. 56ఏళ్ల వయస్సులో 10వ తరగతి ఉత్తీర్ణ సాధించారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తున్న ఆయన 47.2శాతం మార్పులతో ఉత్తీర్ణత సాధించారు. ఝార్ఖండ్ ఖుంఠీలోని కలామతి గ్రామానికి చెందిన గంగా ఓరమ్ వయస్సు 56సంవత్సరాలు. ఆయనకు భార్య, తల్లితోపాటునలుగురు కూతుళ్లు ఉన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్నారు. సుమారు 16ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన నెలకు రూ. 9వేలు అందుకుంటున్నారు. అయితే చాలా కాలం నుంచి తనను పర్మినెంట్ చేయాలంటూ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే పదవ తరగతి పాస్ కాలేదన్న కారణంతో ఆయన విజ్నప్తిని పక్కన పెట్టారు. దీంతో విసుగు చెందిన గంగా ఓరమ్, పదవ తరగతి పాస్ కావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బిర్సా హై స్కూల్లో ఫీజు కట్టి పదవ తరగతి చదివాడు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు హాజరైన ఆయన 47.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందారు.
గంగా ఓరమ్ పదవ తరగతి పాస్ అవ్వడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కుమార్తెలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఈవో అపూర్వ పాల్ చౌదరీ కూడా గంగాఓరమ్ ను అభినందించారు. విద్యాశాఖ తరపున ఆయనను సత్కరిస్తామని తెలిపారు. తాను పదో తరగత పాస్ అవ్వడంతో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఓరమ్ ఆశిస్తున్నారు.