Election2019 : జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు : నేడే నాలుగో విడత పోలింగ్

Update: 2019-12-16 04:17 GMT
ప్రతీకాత్మక చిత్రం

ఝార్ఖండ్ లో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఐదు విడుతలలో జరగనుండగా ఇప్పటికే 3 విడతల ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం నుంచి 4వ విడత పోలింగ్ మొదలయింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే 47,85,009 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 15 స్థానాలకు జరుగుతున్నఈ ఎన్నికల్లో, 221 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. వీరిలో 23 మంది మహిళలు ఉండడం విశేషం.

15 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాలైన జమువా, బోగడర్, గిరిధ్, దుమ్రి, తుండి లో మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ ముగించనున్నారని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రిగ్గింగ్ లకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి రాజ్ పలివార్, రెవెన్యూశాఖ మంత్రి అమర్ కుమార్ బౌరీలు బరిలో ఉన్నారు. వారితో పాటు నీరజ్ సింగ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజీవ్‌సింగ్ భార్య రజని కూడా ఎన్నికల బరిలో దిగారు. దీంతో రజనికి ప్రత్యర్థిగా హత్యకు గురైన నీరజ్‌సింగ్ భార్య పూర్ణిమ బరిలో ఉన్నారు. ఇక పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారో ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News