ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఉద్యోగులు పాజిటివ్..
ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభించిన వణికిస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందిన 4 ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభించిన వణికిస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందిన 4 ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కేంద్ర కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ ను పూర్తిగా మూసివేశారు.
రెండ్రోజుల పాటు మూసివేసి పూర్తిగా శానిటైజేషన్ చేయనున్నారు. కాగా, కరోనా సోకిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ పంపినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీలో 19,844 కేసులు వెలుగుచూడగా, 473 మంది మరణించారు.