నిల‌క‌డ‌గానే మ‌న్మోహన్‌సింగ్ ఆరోగ్యం

Update: 2020-05-11 03:55 GMT
ManMohan Singh (File Photo)

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జ్వరం, ఛాతి నొప్పితో నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.‌ ప్రస్తుతం ఆయన కార్డియో-థొరాసిక్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే స్వ‌ల్పంగా జ్వ‌రం ఉన్న‌ద‌ని, ఛాతీనొప్పి త‌గ్గ‌డానికి ఇచ్చిన‌ ఔషధాలవ‌ల్ల జ్వ‌రం వ‌చ్చి ఉంటుంద‌ని వైద్యులు తెలిపిన‌ట్లు స‌మాచారం. జ్వ‌రానికి ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు అన్ని ర‌కాల వైద్య‌ ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది.

మన్మోహస్‌ సింగ్‌కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్‌ సర్జరీ జరిగిన‌ట్లు తెలుస్తోంది. మన్మోహన్‌ 2004 నుంచి 2014 వరకు ఇండియాకు ప్రధాన మంత్రిగా సేవ‌లందించారు. ప్రధానమంత్రి గానే కాకుండా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పని చేశారు. అంతేకాకుండా భారత రిజర్వు బ్యాంకుకి డైరెక్టర్ గా కూడా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు. ఇక ఆయన ఆస్పత్రిలో చేరడంతో కాంగ్రెస్ నేతలు, మరియు రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. 

 

Tags:    

Similar News