ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి వలస కార్మికుల మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ట్రక్కు బోల్తా పడటంతో ఐదుగురు వలస కార్మికులు మరణించారు.

Update: 2020-05-10 03:57 GMT

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ట్రక్కు బోల్తా పడటంతో ఐదుగురు వలస కార్మికులు మరణించారు మరో 15 మంది గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ పఠారోడ్‌ వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 20 మంది ఉన్నట్లు తెలిసింది. నర్సింగ్‌పూర్‌లోని పఠారోడ్‌ వద్ద ట్రక్కు బోల్తా పడిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించామని అన్నారు, వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు ఇందులో ఒక కార్మికుడికి కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో మిగతా వారందరికి కరోనావైరస్ పరీక్షలు చేయాలనీ నిర్ణయించారు, కాగా దేశవ్యాప్తంగా 62,000 మందికి పైగా కరోనా సోకింది.. 1,900 మందికి పైగా మరణించింది. ఇదిలావుంటే ప్రత్యేక రైళ్లు , బస్సులలో ఇంటికి చేరుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ , చాలామంది ఇప్పటికీ సుదీర్ఘ నడకను కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News