Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు
Fire Accident: అందర్‌కుప్పంలో ఓ పెయింట్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు
Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందర్‌కుప్పంలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు ఎగసిపడ్డాయి. 8 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. రంగంలోకి దిగిన తోటి కార్మికులు, స్థానికులు.. కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన పొగ కమ్మేయడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.