Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక గుడికట్టిన అభిమానులు

Yogi Adityanath: ఆయోధ్య జిల్లా భరత్ కుండీ సమీపంలోని మౌర్యకా పూర్వ గ్రామంలో గుడి

Update: 2022-09-19 02:05 GMT

Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక గుడికట్టిన అభిమానులు

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అభిమానులు గుడికట్టారు. రామ బాణాన్ని ప్రయోగిస్తున్నట్లుగా విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందివ్వడంలో యోగి ఆదిత్య నాథ్ విజయం సాధించారని గ్రామీణప్రాంతంలో ఓ అభిమాని గుడికట్టేశాడు. ఆయోధ్య జిల్లా భరత్ కుండీ సమీపంలోని మౌర్యకా పూర్వ గ్రామంలో ఆదిత్యనాథ్ గుడి వెలసింది. గుడిలో ఆదిత్యనాథ్ నిలువెత్తు రూపంతో కాషాయ వస్త్రధారణతో చేతిలో బాణం పట్టుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

Tags:    

Similar News