ఈ నెల 12న కేంద్రమంత్రివర్గ విస్తరణ.. 22 మందిని తొలగించి కొత్త వారికి ఛాన్స్..?
Union Cabinet Meeting: ఏపీ, తెలంగాణ నుంచి ఎవరికి అదృష్టం వరిస్తుందో..?
ఈ నెల 12న కేంద్రమంత్రివర్గ విస్తరణ.. 22 మందిని తొలగించి కొత్త వారికి ఛాన్స్..?
Union Cabinet Meeting: ఈ నెల 12న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం 22 మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరికి అదృష్టం వరిస్తుందో? అనే ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్‌లో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 12న కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 13వ తేదీన ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. మోడీ విదేశీ పర్యటనకు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, సోయం బాపూరావు, కె.లక్ష్మణ్ ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి సీఎం రమేష్‌కు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ లో ఏపీకి స్థానం కల్పించకపోవడంతో... తాజా మంత్రివర్గ విస్తరణలో ఏపీ బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన బండి సంజయ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ కూర్పులో బండి సంజయ్‌కు ఛాన్స్ దక్కుతుందో? లేదో? బుధవారం వరకూ వేచిచూడాల్సి ఉంది.