PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధం

PM Modi: 24,25 తేదీల్లో ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ

Update: 2023-06-19 12:14 GMT

PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధం

PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటనలో భాగంగా రేపు అమెరికాకు బయలుదేరనున్నారు ప్రధాని. ఈనెల 21 యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో నిర్వహించే యోగా సెషన్స్‌లో పాల్గొంటారు. ఈ యోగా సెషన్‌లో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు పాల్గొంటారు. ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు ప్రధాని. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తర్వాత కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి బైడెన్ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటారు ప్రధాని.

ఈనెల 23న వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ ఇచ్చే విందుకు హాజరై. పలు కంపెనీల సీఈవోలు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటించనున్నారు. ఇక ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయలు. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌, అమెరికా సంబంధాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే పలు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక అమెరికా పర్యటన అనంతరం 24,25 తేదీల్లో ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. 

Tags:    

Similar News