కాశ్మీర్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు.. ఏ క్షణమైనా ఆ ముగ్గురు ఎన్ కౌంటర్..
ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తుపాకీ యుద్ధం జరిగిందని అధికారులు బుధవారం ఉదయం తెలిపారు.
ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తుపాకీ యుద్ధం జరిగిందని అధికారులు బుధవారం ఉదయం తెలిపారు.అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఒక ఇంట్లో చిక్కుకున్నారని, దీంతో కార్డన్ ఏర్పాటు చేయబడిందని చెప్పారు.
సోపోర్ పట్టణంలోని గులాబాగ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి బలగాలు ఆపరేషన్ ప్రారంభించి, ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండటానికి అన్ని మార్గాలను సీల్ చేశారు. ఈ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ కూడా నిలిపివేయబడిందని అధికారులు తెలిపారు.
కాగా దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పెట్రోలింగ్ పార్టీ వాహనంపై ఉగ్రవాది గ్రెనేడ్ విసిరారు.. దాంతో సిఆర్‌పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మంగళవారం మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం బీజ్‌బెహారాలో జరిగిన సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ శివాల్ లాల్ నీతం మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మరోవైపు సోపోర్ పట్టణంలోని పోలీసు ఉన్నతాధికారులు.. ఉగ్రవాదులను పట్టుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు సహాయం చేస్తున్నారు.