Chhattisgarh: పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

Chhattisgarh: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

Update: 2024-03-19 08:49 GMT

Chhattisgarh: పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

Chhattisgarh: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్​గఢ్‌ సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. వారిని మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌‌, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్‌ సభ్యులు కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రకటించింది. వారిపై 36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.

Tags:    

Similar News