జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర కదలికలు.. చుట్టుముట్టిన భద్రతా దళాలు
శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని దైరూ కీగం గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని దైరూ కీగం గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న పోలీసు, ఆర్మీ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సంయుక్త బృందం ఈ ప్రాంతంలో ఒక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులను దాక్కున్న అనుమానాస్పద ప్రదేశంలో బలగాలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఎటూ కదల్లేని స్థితిలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దీంతో ఇది ఎన్‌కౌంటర్‌కు కారణమైందని అధికారి తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా జరుగుతోంది. అయితే ఎన్‌కౌంటర్ పై ఇంకా పూర్తి సమాచారాన్ని అధికులు ఇవ్వలేదు. ఇదిలావుంటే ఇటీవల కూడా ఎనిమిది మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఇందులో పాక్ సైనికులు కూడా మృతి చెందినా తమ వాళ్ళు ఎవరూ మరణించలేదని పాకిస్థాన్ బుకాయించింది.