Bakrid 2025: ఈ ఏడాది బ‌క్రీద్ ఎప్పుడంటే.. ఇంత‌కీ పండ‌గ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Bakrid 2025: ఈద్ అల్ అధా (Eid Al Adha)ను బక్రీద్ లేదా బలిదాన పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ముస్లింలు జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగలలో ఒకటి. బక్రీద్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ కాలెండర్ ప్రకారం ధుల్ హిజ్జా నెల 10వ తేదీన జరుగుతుంది.

Update: 2025-06-02 08:54 GMT

2025లో బక్రీద్ ఎప్పుడు?

భారతదేశంతో పాటు పలు దేశాల్లో బక్రీద్ 2025లో జూన్ 7న జరగనుంది. అయితే, సౌదీ అరేబియా, ఒమాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇది జూన్ 6న జరగనుంది. భారతదేశం, నైజీరియా, న్యూజిలాండ్, మ‌లేషియా, మొరాక్కో, బంగ్లాదేశ్‌లో జూన్ 7వ తేదీన బ‌క్రీద్ జ‌ర‌గ‌నుంది.

బలిదానం వెనుక ఉన్న ఉద్దేశ్యం

ఈ పండుగలో మూల ఉద్దేశం అల్లాహ్ ఆజ్ఞకు లోబడి ఉండటం. హజ్రత్ ఇబ్రాహీం తన కుమారుని బలిచేయాలని సిద్ధపడిన నమ్మకానికి గుర్తుగా, బక్రీద్ రోజున మేక‌ల‌ను బ‌లిస్తుంటారు. ఈ బలిదానం తరువాత మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు – ఒక భాగం కుటుంబానికి, ఒక భాగం బంధువులకు, మరొక భాగం పేదల కోసం.

ఎలా జరుపుకుంటారు?

ఈద్ రోజు ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో నమాజ్ (ప్రార్థనలు) చేస్తారు. అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటారు.

బలిదానం, దానధర్మాలు

పేద‌లకు మాంసం కొనుగోలు చేసే స్థోమ‌త ఉండ‌దు. ఈ కార‌ణంగానే కుర్బానీలో ఒక భాగాన్ని పేదలకు ఇవ్వడం తప్పనిసరి. కొందరు తమ ఆదాయాన్ని వినియోగించి జంతువులను కొనుగోలు చేసి ఈ ఆచారం నిర్వహిస్తారు. మరికొందరు సేవాసంస్థలకు డబ్బును దానం చేసి, వాటి ద్వారా పేదలకు మాంసం, అవసరమైన వస్తువులు అందేలా చేస్తారు.

Tags:    

Similar News