ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై..
ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.
ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.4 మాగ్నిట్యూడ్స్ గా నమోదయింది. భూప్రకంపనలు వచ్చిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్ల నుంచి భయంతో బయటకు వచ్చారు. ముఖ్యంగా ఫ్లాట్లలో నివసించే ప్రజలు మరింతగా భయపడ్డారు. చాలా మంది తమ ఫ్లాట్ల నుంచి రోడ్ల మీదకు వచ్చారు. ఇక భూప్రకంపనల కేంద్రం తూర్పు ఢిల్లీలో నమోదైనట్టు సమాచారరం. 29 సెకన్లలో ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించిందని పలు ఆంగ్ల వెబ్ సైట్లు కథనాలు రాశాయి. ఏప్రిల్ 12 , 13 తేదీల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.