Indian wrestlers: ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారత రెజ్లర్ల ధర్నా
Indian wrestlers: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు
Indian wrestlers: ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారత రెజ్లర్ల ధర్నా
Indian wrestlers: భారత రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భారత రజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. రెజ్లర్ల ధర్నా రెండో రోజు కూడా కొనసాగుతోంది. రెజ్లింగ్ సమాఖ్యకు చెందిన కోచ్ లు కూడా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ధర్నాలో ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొల్గొని సంఘీభావం తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఖండించారు. తాను తప్పు చేసినట్టు రుజువైతే ఊరేసుకుంటానని ప్రకటించారు.