Breaking: ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2020-01-09 10:42 GMT
ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉగ్రస్థావరం ఉన్నట్లు కనుగొన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులకు పాల్పడ్డ పోలీసులు ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.

Tags:    

Similar News