ఢిల్లీని వణికిస్తున్న చలిపులి..118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు.!

దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణ పరిస్థితి అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది.

Update: 2019-12-27 06:41 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణ పరిస్థితి అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో లేనంత అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ ఏడాది లేనంతగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇదే కోణంలో చలిపులి ఢిల్లీని వణికిస్తోంది. ఎముకలు కొరికే చలికి వనుకుతూ, మంచు ముద్దలుగా మారిపోతున్నారు. చలి మంటలు కూడా ఆ చలిని అడ్డుకోలేకపోతున్నాయి.

వారం రోజుల నుంచి ఢిల్లీ వాతావణంలో తీవ్రంగా మార్పులు జరిగాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. 1901లో తొలిసారిగా డిసెంబర్‌ నెలలో ఉష్ణోగ్రతలు పడిపోయాలని, మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు నెలకొంటుందని తెలిపారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వాతావరణ రిపోర్టు ప్రకారం 118 ఏళ్ల కు ముందు ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతుల నమోదయ్యాయన్నారు. 2019 డిసెంబర్‌ అతి శీతల రెండో డిసెంబర్‌ నెలగా చరిత్రలో నిలిచిపోనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకూ 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో మాత్రమే డిసెంబర్‌ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 19.15 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పోతే చలి ప్రారంభం అయినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ నాటికి సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 19.85 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయని తెలిపారు.  

Tags:    

Similar News