కత్తితో పార్లమెంట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్

Update: 2019-09-02 08:12 GMT

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్‌‌ దగ్గర ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. కత్తితో పార్లమెంట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్‌ ద్వారమైన విజయ్‌ చౌక్‌ గేట్‌ నుంచి అతను లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుండుగుడిని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. తాజా ఘటనతో పార్లమెంట్‌ భవనం సమీపంలో భద్రతాసిబ్బంది అలర్టయింది.

Tags:    

Similar News