రైల్వేమంత్రి సంచలన ప్రకటన..రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం..

Update: 2019-10-02 09:25 GMT

రైలు సమయానికి రాకుంటే తిరిగి ప్రయాణికులకు పరిహారం చెల్లించే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ప్రకటించారు. దేశంలో మొట్టమొదటి సారి పట్టాలెక్కుతున్న ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా వస్తే పరిహారం చెల్లించనుంది. రైలు గంట ఆలస్యమైతే ప్రయాణికులకు రూ.100 రూపాయలు, 2 గంటలు ఆపైన ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనితో పాటు ప్రయాణికులకు రూ. 25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఇవ్వనుంది. ఈ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సామగ్రి చోరీకి గురి కావడం లేదా దోపిడీ జరగడం వంటివి జరిగితే రూ.లక్ష బీమా వర్తిస్తుంది. అక్టోబర్‌ 14 నుంచి ఢిల్లీ-లక్నో, లక్నో-ఢిల్లీ రూట్లలో నడిచే ఈ రైలును లక్నో నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.



Tags:    

Similar News