వైరల్ ట్వీట్.. 'మా అమ్మకు అందమైన వరుడు కావాలి'

Update: 2019-11-01 09:39 GMT

ఆస్తా వర్మ అనే అమ్మాయి చేసిన ట్వీట్‌.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాళ్ల అమ్మ కోసం ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. 'యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి. మా అమ్మకోసం! అతడు వెజిటేరియన్‌ అయి ఉండాలి. తాగుడు అలవాటు ఉండకూడదు. అంతేకాదు జీవితంలో స్థిరపడినవాడు అయి ఉండాలి' కూడా అంటూ ఆస్తా చేసిన ట్వీట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఆస్తా వర్మ ట్వీట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే.. అందరూ రీ ట్వీట్స్ పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఆమెకు.. ఆల్‌ ది బెస్ట్‌లు, గుడ్‌లక్‌లు చెప్పి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



Tags:    

Similar News