Rahul Gandhi: వలస కార్మికులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సొంతుళ్ళకి నడిచి వెళ్తున్న వలస కార్మికులతో మాట్లాడారు.

Update: 2020-05-17 04:58 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సొంతుళ్ళకి నడిచి వెళ్తున్న వలస కార్మికులతో మాట్లాడారు.ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ ఫ్లైఓవర్ సమీపంలో తమ స్వస్తలాలకి నడిచి వెళ్తున్న వారిని గమనించి వారి వద్దకి వెళ్లి ముచ్చటించారు. పుట్ పాత్ పైనే కూర్చుండి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. నెలన్నర నుంచి పని దొరక్క ఆకలి భరించలేక ఇంటిదారి పట్టామని తమ బాధను వెల్లడించారు. కరోనా వైరస్ నుండి రక్షణ కోసం రాహుల్ గాంధీ వారికి ఆహారం, నీరు మరియు ఫేస్ మాస్క్‌లు అందజేశారు. అంతేకాకుండా వారిని కార్లలో, వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక అంతకుముందు లాక్ డౌన్ వలన చిక్కుకుపోయిన కార్మికులకు, పేద రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీకి అనుకూలంగా ప్రభుత్వం రూ .20 లక్షల కోట్ల కరోనావైరస్ ప్యాకేజీని పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీని రాహుల్ కోరారు. అలా కోరిన కొన్ని గంటల తరువాత ఈ సంఘటన జరిగింది.

ఇక కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సొంత నివాసాలకి వెళ్ళాలి అనుకున్న వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బస్సులు , రైళ్లు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ సొంత వాళ్ళతో కలిసి కాలినడకన వారు ప్రయాణం చేస్తున్న ఘటనలు ఇలా మనం రోజుకు చాలానే చూస్తున్నాం.. అలాంటి ఘటనలు మనల్ని కంటతడి పెట్టిస్తున్నాయి.




 


Tags:    

Similar News