అసలే కరోనావైరస్.. ఆపై కరెన్సీ నోట్లతో నోరూ, ముక్కు తుడుచుకున్నాడు.. చివరకు..

అసలే కరోనా వైరస్ అనేది అంటూవ్యాధి అన్నది ప్రపంచం అందరికి తెలిసిన విషయం.. కానీ ఓ యువకుడికి మాత్రం దీనిపై ఇంకా అవగాహనా రాలేదేమో.. ఏకంగా కరెన్సీ నోట్లతో నోరు, ముక్కు తుడుచుకుంటూ టిక్ టాక్ చేశాడు.

Update: 2020-04-04 10:59 GMT
Jameel sayyad

అసలే కరోనా వైరస్ అనేది అంటూవ్యాధి అన్నది ప్రపంచం అందరికి తెలిసిన విషయం.. కానీ ఓ యువకుడికి మాత్రం దీనిపై ఇంకా అవగాహనా రాలేదేమో.. ఏకంగా కరెన్సీ నోట్లతో నోరు, ముక్కు తుడుచుకుంటూ టిక్ టాక్ చేశాడు. దాంతో జైలు పాలయ్యాడు. వాస్తవానికి సార్స్-కోవి -2 అని పిలువబడే కొత్త కరోనావైరస్ ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర మలేగావ్‌ కు చెందిన సలేద్ జమీల్ సయ్యద్ (38) ను ఇటీవల కరెన్సీ నోట్లతో ముఖాన్ని తుడుచుకుంటూ టిక్ టాక్ చేశాడు.. దాంతో ఈ వీడియో వైరల్ అయింది.

ఒక వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. దాంతో అతనికి ఏప్రిల్ 7 వరకు మాలెగావ్ కోర్టు రిమాండ్ విధించింది" అని ఒక అధికారి పిటిఐ పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో 423 కరోనావైరస్ కేసులు ఉన్నాయి, మరియు కోవిడ్ -19 తో 19 మంది మరణించారు.

దేశవ్యాప్తంగా కేసులు 2,900 దాటాయి, అలాగే మరణాల సంఖ్య 68 గా నమోదైంది. కరోనా వైరస్ ను నివారించాలన్న లక్ష్యంతో సామాజిక దూరాన్ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా భారతదేశం మూడు వారాల లాక్డౌన్ విధించింది.


Tags:    

Similar News