యూపీ సర్కారు సంచలన నిర్ణయం.. పరీక్షలు లేకుండానే అందరూ విద్యార్థులు పాస్

Update: 2020-03-18 08:04 GMT

కరోనా వైరస్ భయంతో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే, అందరూ ఉత్తీర్ణులయినట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వుంది. కరోనా వ్యాప్తితో విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అన్ని పాఠశాలలూ ఏప్రిల్ 2 వరకూ మూసివేయబడి వుంటాయి. తదుపరి పరిస్థితిని బట్టి సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకుంటారు. మిగతా బోర్డు పరీక్షలు ఎప్పుడు జరపాలన్న విషయమై ఏప్రిల్ 2 తరువాత నిర్ణయం తీసుకుంటామని యూపీ ప్రభుత్వం తెలిపింది. 

Tags:    

Similar News