భారత్ లో 13వేలకు పైగా కరోనా కేసులు.. కోలుకున్న వారు ఎక్కువే..
దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 13 వేల 483 కు పెరిగింది. మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 13 వేల 483 కు పెరిగింది. మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో వెయ్యి మందికి పైగా రోగులు ఉన్నారు. గురువారం 1 వేల 81 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో మహారాష్ట్రలో 286, రాజస్థాన్‌లో 55, ఉత్తర ప్రదేశ్‌లో 70, గుజరాత్‌లో 163, బీహార్‌లో 8 మంది రోగులు ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రికార్డు స్థాయిలో 256 మందికి వైరస్ సోకింది. దేశంలోని ఏ నగరంలో కూడా ఒకేఒజు ఇన్ని కేసులు రాలేదు. అంతేకాదు మధ్యప్రదేశ్ రోగులలో 65% ఇండోర్‌లోనే ఉన్నారు. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం పేర్కొనబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు 13 వేల 387 కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 11 వేల 201 మంది రోగులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 437 మంది మరణించారు. 1,748 మందికి నయమైంది.. ఇది కొంత ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు.