మద్రాసు హైకోర్టులో కరోనా కలకలం.. ముగ్గురు జడ్జీలకు కరోనా

మద్రాసు హైకోర్టులో కరోనా కలకలం రేపింది. లాక్ డౌన్ సమయంలో కోర్టును మూసివేశారు.

Samba Siva Rao
Updated on: 7 Jun 2020 11:39 AM IST
మద్రాసు హైకోర్టులో కరోనా కలకలం.. ముగ్గురు జడ్జీలకు కరోనా
X

మద్రాసు హైకోర్టులో కరోనా కలకలం రేపింది. లాక్ డౌన్ సమయంలో కోర్టును మూసివేశారు. ఆ తరువాత ఈ నెల 1 నుంచే కోర్టులో విచారణలు తిరిగి మొదలయ్యాయి. హైకోర్టులో ముగ్గురు జడ్జిలకు కరోనా పాజిటివ్ రావడంతో, మొత్తం హైకోర్టును మళ్ళీ మూసివేశారు. ఇక నుంచి కేసుల విచారణ ఇంటి నుంచే జరుగుతుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారణలను జరిపించేందుకు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు.

ముగ్గురు జడ్జీలకు కరోనా నిర్ధారణ కావడంతో మిగతా వారి శాంపీల్స్ వైద్యాధికారులు సేకరించి టెస్టుల నిమిత్తం పంపించారు. ఇంకా వారి రిపోర్టులు రావాల్సివుంది. హైకోర్టు న్యాయమూర్తి, ఇతర ఉన్నతాధికారులు,జడ్జి లతో కలిసి సమావేశమై, హైకోర్టుకు తాళం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ రావద్దన్న ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కేసుల నిమిత్తం ఓ ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేసి, జడ్జీలు ఇంటి నుంచే విచారణలు చేపట్టాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story