ఉత్తర ప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా.. కేసుల సంఖ్య ఇలా..
కరోనావైరస్ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఏప్రిల్ 20 న లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన మినహాయింపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
కరోనావైరస్ ప్రభావం ఉత్తర ప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఏప్రిల్ 20 న లాక్డౌన్ సందర్భంగా ఇచ్చిన మినహాయింపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే పది మందికి పైగా కరోనా సోకిన రోగులు ఉన్న జిల్లాలపై తుది నిర్ణయం ఈ రోజు రాత్రిలోపు తీసుకుంటామని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ అవస్థీ చెప్పారు. ఇక యూపీలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 1084 కు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది.
ఆదివారం విలేకరులతో అవినాష్ అవస్థీ మాట్లాడుతూ.. కొన్ని పరిశ్రమలను షరతులతో ఏప్రిల్ 20 నుంచి ప్రారంభించడానికి వీలుగా దీనిపై చర్చించేందుకు సీఎం ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహిస్తారని చెప్పారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం సోకిన రోగుల సంఖ్య 1084 కు పెరిగిందని, అందులో 959 కేసులు యాక్టీవ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు 108 మందిని డిశ్చార్జ్ చేశారని.. అలాగే 10,234 మంది రోగులను నిర్బంధంలో ఉంచినట్టు చెప్పారు.