కాంగ్రెస్ కి కొత్త బాస్ ... రేసులో వీరే ముందు

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాని నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అయన రాజీనామా తరవాత అ స్థానంలో ఎవరు వస్తారన్న చర్చ బాగానే నడిచింది . అయితే ఇప్పుడు అ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది .

Update: 2019-08-09 13:26 GMT

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాని నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .. అయన రాజీనామా తరవాత అ స్థానంలో ఎవరు వస్తారన్న చర్చ బాగానే నడిచింది . అయితే ఇప్పుడు అ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది . తాజా సమాచారం ప్రకారం శనివారం రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు అన్నా చర్చ నడుస్తుంది . ఇప్పుడు రాహుల్ ప్లేస్ ని రీప్లేస్ చేసే నేత ఎవరన్నది మాత్రం దేశ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తుంది . కాంగ్రెస్ అధ్యక్ష రేస్‌లో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ సుశీల్ షిండే, ఖర్గే, వాస్నిక్‌ పేర్లు మెయిన్ గా వినిపించాయి. ఐతే ఇందులో ఖర్గే, వాస్నిక్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అంతే కాకుండా గాంధీ ఫ్యామిలీకి వీరిద్దరు ఆప్తులు. వీరిలో ఒకరికి పార్టీ అధ్యక్ష పదవిని కట్టాబెట్టాలని సోనియా, రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  

Tags:    

Similar News