Congress: పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో సమావేశం కానున్న కాంగ్రెస్ ఎంపీలు
Congress: విపక్షాలతో కలిసి కేంద్రంపై పోరాటానికి నిర్ణయం
Congress: పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో సమావేశం కానున్న కాంగ్రెస్ ఎంపీలు
Congress: కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రాహుల్‌పై అనర్హత వేటుతో విపక్షాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఈ విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ కూడా పార్లమెంట్ ముందు నల్లదుస్తులతో నిరసనలు కొనసాగించనున్నాయి విపక్షాలు.
మరోవైపు ప్రతిపక్షాలకు పోటీగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరు, విపక్షాల నిరసనలతో పాటు.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై వస్తున్న విమర్శలపై చర్చిస్తున్నారు.