భారత్ రక్షణ వ్యవస్థను చూసి భయపడుతున్న చైనా

Update: 2020-01-20 15:57 GMT

చైనాపై పెద్ద ఎత్తున కన్నేసి ఉంచేందుకు భారతీయ రక్షణ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సూపర్ సానిక్ బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లగలిగే సుఖోయ్ యుద్ధ విమానాలను తమిళనాడులోని తంజావూరు ఎయిర్ బేస్ లో భారీగా మోహరించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ స్క్వాడ్రన్ ఇకపై పూర్తి స్థాయిలో సరిహద్దుల్లో గస్తీ తిరిగేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఈ స్క్వాడ్రన్ కి టైగర్ షార్క్స్ అని పేరు పెట్టారు. బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణుల సాయంతో చాలా దూరంలో ఉన్న టార్గెట్ పై నిప్పులు కురిపించే అవకాశం ఇప్పుడు పూర్తి స్థాయిలో భారత్‌కి చేకూరిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. నేలమీద లేదా నీటిమీద ఉన్న టార్గెట్ ని సుఖోయ్ యుద్ధ విమానాల్లో అమర్చిన బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్షిపణులు క్షణాల్లో భస్మీపటలం చేయగలుగుతాయి. 

Tags:    

Similar News