రాహుల్.. పెళ్లి చేసుకుంటే రాటుదేలుతావు!

Update: 2019-06-16 10:38 GMT

రాహుల్ గాంధీ నువ్వు పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకుంటే రాటు తేలతావు.. అంటున్నారు కేంద్ర మంత్రి అథవాలే! ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ విజయం కోసం కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్ సభ స్థానాలకే పరిమితం అయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే స్పందించారు. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి మానసికంగా దృఢంగా తయారు కావాలంటే వెంటనే పెళ్లి చేసుకోవాలని రాహుల్ కు అథవాలే సూచించారు. రాహుల్ గాంధీ తనకు మిత్రుడనీ.. అందుకే ఈ సూచన చేస్తున్నాననీ అయన చెప్పారు.  


Tags:    

Similar News