లాక్‌డౌన్‌ను పొడిగించే వార్తలపై కేంద్రం వివరణ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది.

Update: 2020-03-30 06:47 GMT
Lock Down (Representational Image)

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలు కూడా దీనికి మానసికంగా సిద్ధపడ్డారు. అయితే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో ప్రజలు ఈ వార్తలను నిజమని అనుకుంటున్నారు. కొందరైతే ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్‌ గడువు పెంచుతారన్న వదంతులు అవాస్తమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ 21 రోజులేనని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. కాగా కరోనా చైన్‌ను తెంచడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే అక్కడే ఉండిపోయారు. ఇదిలావుంటే భారత్‌లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 29 మంది మృత్యువాత పడ్డారు.


Tags:    

Similar News