స్వంత జిల్లాల నుంచే పరీక్షలు... చిరునామాలు పంపాలంటూ ఆదేశాలు

కరోనా విలయం నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతున్న ఎగ్జామ్స్ ను ఎలాగైనా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.

Update: 2020-05-28 06:21 GMT

కరోనా విలయం నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతున్న ఎగ్జామ్స్ ను ఎలాగైనా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికీ పెరుగుతున్న కేసుల వల్ల లాక్ డౌన్ ఎప్పటికీ ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ నేపధ్యంలో దేశం వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ విద్యార్ధులను కాలేజలు, హైస్కూళ్ల నుంచి తమ తమ ఇళ్లకు పంపేశారు. అయితే మరలా ఎగ్జామ్స్ నిర్వహిస్తే వారు తమ పాఠశాలలకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉంటూ తమ జిల్లాలోనే రాసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలు/ జిల్లాలకు వెళ్లిన 10, 12వ తరగతి విద్యార్ధులు.. తాము ఉన్న చోటు నుంచే వాయిదా పడిన ఎగ్జామ్స్‌కు హాజరు కావచ్చునని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.

సొంతూళ్లకు వెళ్లిన విద్యార్ధులు తమ చిరునామా వివరాలను పాఠ‌శాల‌లకు తెలపాలని సూచించారు. దాని ఆధారంగా పాఠ‌శాల‌ యాజమాన్యం వారికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అటు విద్యార్థులు ఏ స్కూల్‌ నుంచి పరీక్షలు రాయాలన్న వివరాలను జూన్ మొదటి వారంలో వెల్లడిస్తామని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కాగా, ఇప్పటికే వాయిదాపడిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను CBSE విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలను జూలై 1 నుంచి జూలై 15 మధ్య నిర్వహించనున్నారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News