సీబీఐ విచారణకు హాజరైన టీవీకే అధ్యక్షుడు విజయ్

Update: 2026-01-12 05:50 GMT

టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తోంది.

Tags:    

Similar News