లాక్డౌన్ ఉల్లంఘన.. బీజేపీ నేతతో సహా 43 మందిపై కేసు నమోదు

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిజెపి సభ్యుడితో సహా నలభై మూడు మందిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Update: 2020-04-13 10:07 GMT

ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిజెపి సభ్యుడితో సహా నలభై మూడు మందిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. దీనిపై సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని, దాని కాపీలు వారి నివాసాలకు అందజేస్తున్నామని, వారి ఇళ్ల వెలుపల కూడా ఉంచామని, ఇందులో బిజెపి సభ్యుడు విపుల్ త్యాగి కూడా వున్నారని తెలిపారు. కాగా దేశంతో పాటు ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది.

రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య సోమవారం నాటికి 538 కు చేరింది. నేడు ఆగ్రాలో మాత్రమే 35 కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి, దాంతో జిల్లాలో మొత్తం 138 మందికి సోకిన వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ ఓ టౌన్‌షిప్‌ లో నాలుగు నెలల వయస్సు చిన్నారికి కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడింది. ప్రస్థుతం అన్ని హాట్‌స్పాట్ ప్రాంతాలు మూసివేయబడిన తరువాత కూడా, కొత్త కేసులు బయటకు వస్తున్నాయి.


Tags:    

Similar News