Bengaluru: ఆమెకు 35, అత‌డికి 25.. తీరా చూస్తే ఓయో రూమ్‌లో దారుణం

Bengaluru: బెంగళూరు నగరంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 36ఏళ్ల మహిళ హరిణి 25 ఏళ్ల తన ప్రియుడి చేతిలో హత్యకు గురైన ఘటన శుక్రవారం జరిగింది. పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓ ఓయో హోటల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Update: 2025-06-10 00:30 GMT

హరిణి అనే మహిళకు కెంగేరి ప్రాంతానికి చెందిన దాసేగౌడ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొంతకాలం కిత్రం ఆమెకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యశస్ అనే యువకుడితో సంబంధం ఏర్ప‌డింది. ఓ జాతరలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త వారి మ‌ధ్య వివాహేత‌ర బంధానికి దారి తీసింది.

దీంతో ఆమె భ‌ర్త దాసేగౌడ్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె ఫోన్‌ను తీసేసి, ఇద్దరి మధ్య సంబంధాన్ని తెంచే ప్రయత్నం చేశాడు. తరువాత భర్తను నమ్మించి మళ్లీ ఫోన్ తిరిగి పొందిన హరిణి, యశస్‌తో మళ్లీ టచ్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యశస్ ఆమెను బెంగళూరులో ఓ హోటల్‌కి రమ్మని పిలిచాడు. ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రి మ‌ధ్య మాటల యుద్ధం పెరిగింది.

యశస్ ఆమెతో జీవితం గడపాలని కోరగా, ఆమె నిరాకరించడంతో కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హరిణి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, యశస్ అక్కడి నుంచి పారిపోయాడు. వివరాలు తెలుసుకున్న‌వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా యశస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News