బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్
బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ అస్సాంలో కలకలం రేపింది.
బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ అస్సాంలో కలకలం రేపింది. కాచర్ జిల్లా బోర్ఖోలా ప్రాంతంలోని పొలంలో ఆదివారం పెద్ద బెలూన్ పడటాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని బెలూన్‌ను పరిశీలించారు.
బెలూన్‌పై బంగ్లాదేశ్ సిల్హెట్‌లోని గిలాచార ద్విముఖి హై స్కూల్ పేరు, ముగ్గురు వ్యక్తుల ఫొటోలు, బెంగాలీ భాషలో వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బెలూన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి అస్సాంలోకి ఎలా వచ్చింది అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.