Mizoram: మిజోరాంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
Mizoram: 40 నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నిక
Mizoram: మిజోరాంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
Mizoram: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇవాళ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 8 లక్షల 57 వేల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 12 వందల 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిజోరం ఓటర్లు రేపు తమ తుది తీర్పును ఇవ్వనున్నారు.
మిజోరంలో అధికార మిజో నేషనలిస్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, జోరాం పీపుల్స్ మూమెంట్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మిజో నేషనలిస్ట్ ఫ్రంట్ జోరుగా ప్రచారం చేసింది. ఐదు సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధితోపాటు , శరణార్థులు, వలసలు వచ్చిన వారి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసింది. మిజోరంలో గత రెండు పర్యాయాలుగా అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది గత ఎన్నికల సమయంలో MNF ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసింది. ఇక బంగ్లాదేశ్, మయన్మార్ తో సరిహద్దులు పంచుకునే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 30 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.