'అశ్వగంధ' తో కరోనాకు బ్రేకులు వేయొచ్చా?

Update: 2020-05-19 07:53 GMT

కోవిడ్-19 ఎదుర్కొనేందుకు సాంప్రదాయ వైద్యం దోహదపడుతుందని కొంత మంది పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అశ్వగంధతో పాటు మరికొన్ని సహజసిద్ధ పదార్థాల ప్రభావంపై ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త పరిశోధనలు చేస్తున్నారు.

ఈ పరిశోధనల్లో కరోనా వైరస్‌లో ఉండే ఎంజైమ్‌ను నియంత్రించడంలో అశ్వగంధ, ప్రొపోలిస్ ప్రభావవంతంగా పనిచేసినట్టు గుర్తించారు. అంతే కాదు మానవ శరీరంలో ప్రవేశించిన కరోనా వైరస్ రెట్టింపు కాకుండా, శరీరంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా అడ్డుకుటుందని పరిశోధనలో వెల్లడయిందని తెలిపారు. భారత దేశంలో వేల ఏళ్లుగా అశ్వగంధను ఆయుర్వేదంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News