పంజాబ్‌ రాష్ట్రంలో హై అలర్ట్

Update: 2019-08-07 15:59 GMT

పంజాబ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భద్రతా దళాలను భారీగా మోహరించింది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెష్‌-ఎ-మొహమ్మద్‌, లష్కర్‌-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News