ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు
ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో భూమి స్వల్పంగా కంపించిందని.
ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో భూమి స్వల్పంగా కంపించిందని.. కాని ఎటువంటి నష్టం జరగలేదు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది.
కాగా ఆదివారం మొదటిసారి దేశ రాజధానిలో 3.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ప్రాంతాన్ని కదిలించింది నిన్న సాయంత్రం 5.45 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దీని కేంద్రం ఢిల్లీలోని వజీరీబాద్‌లో 8 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది.ఎక్కడెక్కడ ప్రభావం చూపించిందో అని సర్వే చేశారు అధికారులు.. ఎక్కడా ఎటువంటి నష్టం జరగలేదని తేల్చింది.. దీంతో పాటు పొరుగున ఉన్న నోయిడా, ఘజియాబాద్ మరియు ఫరీదాబాద్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
ఈ క్రమంలో వరుసగా రెండో రోజు సంభవించిన భూ ప్రకంపనల్లో కూడా ఎటువంటి ప్రాణనష్టం , ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వరుస భూ ప్రకంపనలతో ఢిల్లీ వాసులలో అలజడి నెలకొంది.