Maoist Sudhaker: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్..అగ్రనేత ఎన్ కౌంటర్

Update: 2025-06-05 12:32 GMT

Maoist Sudhaker: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్..అగ్రనేత ఎన్ కౌంటర్

Maoist Sudhaker:మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ ఘటనను మరవకముందే.. మరో అగ్రనేతను పోలీసులు కాల్చి చంపారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. 40సంవత్సరాలుగా మావోయిస్టుఉద్యమంలో ఉన్నారు సుధాకర్. 2004లో నాటి ఏపీప్రభుత్వంతో శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. సింహాచలం అలియాస్ సుధాకర్ పై రూ. 50లక్షల రివార్డు కూడా ఉంది. సుధాకర్ పూర్తి పేరు తెంటు లక్ష్మీనరసింహాచలం. ఇక ఎన్ కౌంటర్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News